![]() |
![]() |
.webp)
ఇది కదా కావాల్సింది.. బుల్లితెర ధారావాహికల్లో ప్రస్తుతం స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ కి యమక్రేజ్ ఉంది. అందులోను గుప్పెడంత మనసు, బ్రహ్మముడి, కృష్ణ ముకుంద మురారీ సీరియల్స్ కి మరీ ఎక్కువగా ఉంది.
గుప్పెడంత మనసు సీరియల్ లో గత కొంతకాలంగా రిషి లేకుండానే సీరియల్ సాగుతోంది. రిషి ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురుచూసే టైమ్ రానే వచ్చింది. గుప్పెడంత మనసు సీరియల్ అభిమానులకు పండగ మొదలైందా.. అవుననే తెలుస్తోంది. స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ లో గత కొన్ని రోజులుగా రిషి పాత్రని చూపించడం లేదు. ఆన్ స్క్రీన్ మీద రిషి, వసుధారల కోసం చూసే వాళ్ళే ఎక్కువ. రిషి అటిట్యూడ్.. వసుధార ఈగో.. రెండు కలిపి రిషీధారగా మారిన ప్రేమ.. ఈ సీరియల్ ని ఎంతో ఎత్తులో నిల్చోబెట్టాయి. అయితే కథలోకి కొత్త విలన్ రాజీవ్ వచ్చి వసుధారని కష్టాల్లో నెట్టడమే పనిగా పెట్టుకుంటే.. ఆ శైలేంద్ర ఎండీ సీటు కోసం గుంటనక్కలా కాపు కాస్కొని కూర్చున్నాడు. అయితే ఎప్పుడు రిషి వస్తాడా.. ఏసేద్దామా అనే పనిలో భద్ర, రాజీవ్, శైలేంద్ర ఎదురుచూస్తుంటే సడన్ గా మాయమయ్యాడు. అయితే మొన్నటి ఎపిసోడ్ లో.. కాలేజీ యూత్ ఫెస్టివల్ కి రిషీ వస్తున్నాడంటూ కాలేజీ స్టూడెంట్స్ తో సహా ఈ సీరియల్ అభిమానులు ఎదురుచూసారు. అయితే వారికి నిరాశే మిగిలింది. రిషిని తీసుకొస్తున్న చక్రపాణిని వెనుకాల నుండి ఎవరో వచ్చి కొట్టి తీసుకెళ్ళడం.. అది విని వసుధార కళ్ళు తిరిగి పడిపోవడం అంతా ఒక కలలా అయిపోయింది. అయితే అసలు కథ ఇప్పుడే మొదలైంది. అసలు రిషిని తీసుకెళ్ళింది ఎవరు? రిషి ఏమైపోయాడు? అనే ప్రశ్నలకి క్లూ ఇస్తూ వసుధార నిన్నటి ఎపిసోడ్ లో చెప్పుకొచ్చింది.
రిషి త్వరలోనే గుప్పెడంత మనసులోకి వస్తున్నాడంటే బయట టాక్ నడుస్తోంది. దర్శకుడు కుమార్ పంతం కొన్ని రోజుల క్రితం రిషి వస్తే మొదటగా మీకే చెప్తానని ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా చెప్పిన విషయం తెలిసిందే. అయితే రిషి వస్తాడంటు వసుధార చెప్పే మాటలకి ఈ సీరియల్ అభిమానులకి ఊరటలా అనిపిస్తున్నాయి. మరి త్వరలోనే రావాలని ఈ సీరియల్ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తుండగా.. మరికొన్ని రోజుల్లో వస్తాడనే ప్రచారం జోరుగా సాగుతుంది. మరి ఏది నిజమో తెలియాలంటే మరికొన్ని ఎపిసోడ్ లు ఎదురుచూడాల్సిందే.
![]() |
![]() |